Abn logo
Sep 20 2020 @ 03:37AM

శ్రీకాంత్‌ కోచ్‌, ఫిజియోకు సాయ్‌ అనుమతి

Kaakateeya

న్యూఢిల్లీ: డెన్మార్క్‌ ఓపెన్‌కు తన వెంట ప్రయాణించేందుకు కోచ్‌, ఫిజియోను కూడా అనుమతించాలని తెలుగు షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ చేసిన విజ్ఞప్తిని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) మన్నించింది. వచ్చే నెల 13న మొదలవనున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు సాధ్యమైనంత ముందుగా అక్కడికి తాము చేరేలా చూడాలని కూడా శ్రీకాంత్‌ కోరాడు. శ్రీకాంత్‌ టార్గెట్‌ ఒలింపిక్స్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో ఉండడంతో అతడి ఖర్చులన్నీ సాయ్‌నే భరించనుంది. కరోనా వల్ల నిలిచిపోయిన బ్యాడ్మింటన్‌ పోటీలు డెన్మార్క్‌ ఓపెన్‌తో పునప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో శ్రీకాంత్‌తోపాటు సైనా, లక్ష్యసేన్‌ కూడా పాల్గొననున్నారు.

Advertisement
Advertisement
Advertisement