Abn logo
Jul 14 2020 @ 12:46PM

ఇద్ద‌రు హీరోయిన్స్‌తో శ్రీవిష్ణు రొమాన్స్‌?

నేటి తరం హీరోల్లో శ్రీవిష్ణు సినిమాల ఎంపిక విభిన్నంగా సాగుతుందనే చెప్పాలి. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన కథా చిత్రాలకు, పాత్రలకు ప్రాముఖ్యతనిస్తూ సినిమాలు చేస్తున్నారు శ్రీవిష్ణు. గ‌త ఏడాది శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘బ్రోచేవారెవ‌రురా’, ‘తిప్పరా మీసం’ చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ‘బ్రోచేవారెవ‌రురా’  చిత్రంతో మంచి హిట్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్‌ను శ్రీవిష్ణు ఓకే చేశార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఇందులో శ్రీవిష్ణు జ‌త‌గా నివేదా థామ‌స్‌, నివేదా పేతురాజ్ జంట‌గా న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement