Advertisement
Advertisement
Abn logo
Advertisement

5 స్టార్‌ పోస్టాఫీ‌స్‎గా ఎస్‌ఆర్‌నగర్‌

హైదరాబాద్/అమీర్‌పేట: ఫైవ్‌స్టార్‌ పోస్ట్‌ ఆఫీ్‌సగా ఎస్‌ఆర్‌నగర్‌ ఉప తపాలా కార్యాలయం ఘనత సాధించింది. నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసినందుకు ఈ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఆవార్డులు అందుకోనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు హెడ్‌ క్వాటర్స్‌ రీజియన్‌ తెలంగాణ సర్కిల్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ టీఎం శ్రీలత తపాలా కార్యాలయానికి చేరుకుని అధికారికంగా ప్రకటించనున్నారు. హైదరాబాద్‌ నార్త్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో 26 పోస్టాఫీసులుండగా ఎస్‌ఆర్‌నగర్‌ తపాలా కార్యాలయానికి ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ రావడం పట్ల సంస్థ ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌ నెలలో సంస్థ ఉన్నతాధికారులు 5 రంగాలలో ఇచ్చిన టార్గెట్లను అధిగమించినందుకు ఫైవ్‌ స్టార్‌ హోదా లభించింది. మొదటి రంగమైన పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, సుకన్య సమృద్ధి యోజన, ఆధార్‌ అనేబుల్డ్‌ పేయింగ్‌, ఇండియన్‌ పోస్టల్‌ సేవింగ్స్‌ (డిజిటల్‌)ఖాతాల ప్రారంభం, ఆధార్‌కార్డు అప్‌డేట్‌, లింక్‌ లాంటి ఐదు విభాగాల్లో అనతి కాలంలో లక్ష్యాలను సాధించారు. ఏటీఎం కార్డు ఉన్న బ్యాంకుల వెళ్లి డబ్బులు డ్రా చేసుకోలేని వారు సమాచారం ఇస్తే నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి బయోమెట్రిక్‌తో రూ.10 వేలు అందించడం, 10 సంవత్సరాల లోపు ఆడ పిల్లలకు పోస్టల్‌ ఖాతా ప్రారంభించడం, తదితర లక్ష్యాలకు ఇక్కడి ఉప తపాల కార్యాలయం సేవలందించిందని అసిస్టెంట్‌ సుపరింటెండెంట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ విభాగం అధికారి సత్యంద్రే కృష్ణ వెల్లడించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement