Jul 28 2021 @ 11:03AM

'ఎస్ ఆర్ కల్యాణమండపం' ట్రైలర్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం 'ఎస్ ఆర్ కల్యాణమండపం'. తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సాంగ్స్, టీజర్‌తో ఇప్పటికే మంచి అంచనాలు ఏర్ప్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర బృంతం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకునేందుకు కిరణ్ అబ్బవరం ప్రయత్నిస్తున్నాడు. ఆ యాటిట్యూడ్, పర్ఫార్మెన్స్‌లో అర్థమవుతోంది. ఇక ఈ యంగ్ హీరోకి జంటగా 'టాక్సీవాలా' ఫేం ప్రియాంక జవాల్కర్ నటించగా, ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఆగస్టు 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.