Abn logo
Aug 7 2020 @ 03:08AM

ఎస్పీవై ఆగ్రోలో మరో పేలుడు

  • పేలిపోయిన బాయిలర్‌... వేడి నీళ్లు కార్మికులపైకి
  • ఒక కార్మికుడి మృతి... మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

నంద్యాల(నూనెపల్లె), ఆగస్టు 6: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని పవర్‌ ప్లాంట్‌ విభాగంలో బాయిలర్‌ పైపులు పేలడంతో దీంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. పేలుడు ఘటనను ఫ్యాక్టరీ యాజమాన్యం గోప్యంగా ఉంచాలని చూసినా కార్మికుడు మృతి చెందడంతో వెలుగులోకి వచ్చింది. గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌మూర్తి(62), నంద్యాల పట్టణానికి చెందిన సహచర కార్మికుడు చిన్నమౌలాలి, ఓబులేసులు ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలోని పవర్‌ ప్లాంట్‌ బాయిలర్‌ పైపుల వద్ద బుధవారం అర్థరాత్రి విధులు నిర్వహిస్తున్నార ు. బాయిలర్‌ పైపులు ఒక్కసారిగా పేలిపోయింది.


దాంతో పైపుల నుంచి వేడినీరు అక్కడ పని చేస్తున్న ముగ్గురు కార్మికులపై పడింది. చికిత్స నిమిత్తం ముగ్గురిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. వీరిలో లక్ష్మణ్‌మూర్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యసేవల కోసం కర్నూలుకు తరలించారు. గురువారం ఆస్పత్రిలోనే లక్ష్మణ్‌మూర్తి మృతి చెందాడు. లక్ష్మణ్‌మూర్తి మృతితో ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటన వెలుగులోకి వచ్చింది. 

Advertisement
Advertisement
Advertisement