కావలసినవి: పెసలు, బొబ్బర్లు, సెనగలు, ఉప్పు, నూనె
తయారీ విధానం: ముందుగా పెసలు, బొబ్బర్లు, సెనగలను నానబెట్టుకోవాలి. తరువాత మొలకలు వచ్చేందుకు గుడ్డలో కట్టి పెట్టాలి. గింజలన్నీ మొలకలు వచ్చిన తరువాత రుబ్బి మెత్తగా పిండి తయారుచేసుకోవాలి. స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడల్లా ఒత్తుకుంటూ నూనెలో వేసి వేగించాలి. చట్నీతో వడ్డించాలి. పోషకాలు పుష్కలంగా లభించే మొలకల వడ ఆరోగ్యానికి చాలా మంచిది.