Abn logo
Mar 25 2020 @ 05:27AM

ప్రాణాలు ముఖ్యం.. సరైన నిర్ణయం

ప్రస్తుతం పరిస్థితి బాగా లేదు. ప్రాణాలు ముఖ్యం.. ఆ తర్వాతే ఏదైనా. ఒలింపిక్స్‌ కోసం వచ్చే ఏడాది దాకా ఎదురుచూస్తాం. వాయిదా నిర్ణయం మాకు సమ్మతమే.

- మేరీ కోమ్‌ (బాక్సర్‌)


ఒలింపిక్స్‌కు నేను ఇంకా అర్హత సాధించకపోయినప్పటికీ.. వాయిదా పడడం సంతోషంగా ఉంది. ఇప్పుడు అర్హత విధానాన్ని ఎలా నిర్ణయిస్తార్ననది ఆసక్తికరంగా ఉంది.

- సైనా నెహ్వాల్‌ (షట్లర్‌)


ప్రపంచమంతా కరోనాతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో క్రీడలు వాయిదా అనేది సరైన నిర్ణయం.

 - బజ్‌రంగ్‌ పూనియా (రెజ్లర్‌)


ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. సాధన చేసేందుకు ఇప్పుడు మరింత సమయం దొరికింది.

-  మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టర్‌)

Advertisement
Advertisement
Advertisement