Advertisement
Advertisement
Abn logo
Advertisement

సైనాకు మాల్విక షాక్‌

క్వార్టర్స్‌కు సింధు, సాత్విక్‌ జోడీ 


న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ఈ స్టార్‌ షట్లర్‌ తనకంటే తక్కువ ర్యాంకర్‌ చేతిలో ఓడి టోర్నీలో తన పోరాటాన్ని ముగించింది. ఇక, టాప్‌సీడ్‌ పీవీ సింధు, లక్ష్యసేన్‌, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో నాగ్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల మాల్విక బన్సోడ్‌ 21-17, 21-9తో సైనాను చిత్తుచేసి సంచలనం సృష్టించింది. 111వ ర్యాంకరైన మాల్విక కెరీర్‌లో ఇదే అతిపెద్ద విజయం. సింధు 21-10, 21-10తో ఐరా శర్మపై, అస్మిత 21-17, 21-14తో ఎల్లీ హెయాయెక్స్‌పె నెగ్గారు. లక్ష్యసేన్‌ 21-12, 21-15తో ఫెలిక్స్‌పై గెలిచాడు. డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-9, 21-18తో శ్యామ్‌-సన్‌జిత్‌ జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది. 

Advertisement
Advertisement