Abn logo
May 21 2020 @ 04:12AM

అసభ్యకరంగా ప్రవర్తించి..కటకటాల పాలై..

టెహ్రాన్‌: అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఇరాన్‌కు చెందిన 28 ఏళ్ల పార్కూర్‌ అథ్లెట్‌ అలీరజా జపలాఘీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భవనాలమీద నుంచి భవనాల మీదకు దూకడంతో పాటు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసే పార్కూర్‌ అథ్లెట్‌గా అలీరజా ప్రసిద్ధుడు. అయితే స్థానికంగా ఓ భారీ భవనం అంచున తాను, ఓ మహిళా చుంబించుకుంటున్న వీడియో, ఫొటోలను అలీరజా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వీడియోలోని మహిళను కూడా అరెస్ట్‌ చేయనున్నట్టు వారు తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement