Abn logo
Jul 15 2020 @ 03:19AM

తెలంగాణకు రూ.218 కోట్లు కేటాయించండి

క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణలో క్రీడల అభివృద్ధికి రూ.218 కోట్లు కేటాయించాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు వివిధ రాష్ట్రాల క్రీడా మంత్రులు, ఆ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడ రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.218 కోట్ల అంచనాలతో రూపొందించిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని..వాటిని తక్షణమే ఆమోదించాలని కోరారు. రాష్ట్రానికి ఆరు క్రీడలకు సంబంధించిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను మంజూరు చేయాలని ప్రతిపాదించగా మూడే కేటాయించారని..మరో మూడింటిని కూడా త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలానే రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీని రూపొందించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ పనిచేస్తోందని రిజిజుకి వివరించారు. సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ ఎండీ రఘనందన్‌రావు, ఏఓ సుజాత, డీడీలు ధనలక్ష్మి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement