Advertisement
Advertisement
Abn logo
Advertisement

జనవరి 8న మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

గుంటూరు(క్రీడలు), డిసెంబరు 2: నంబూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో  జనవరి 8, 9 తేదీల్లో మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు.  పోటీల బ్రోచర్‌ను గురువారం హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ 35 నుంచి 95 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చుక్కా కొండయ్య, దివాకర్‌, దుర్గాప్రసాదు, నాగరాజు, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

5న నెట్‌బాల్‌ జిల్లా జట్టు ఎంపికలు

జిల్లా నెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 5న స్థానిక బీఆర్‌ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగంలో నెట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన జట్లు ఈ నెల 17,18,19 తేదీల్లో వైజాగ్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు.  వివరాలకు 9949646430 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

జిల్లా క్రాస్‌కంట్రీ ఎంపికలు ప్రారంభం

అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ జిల్లా ఆధ్వర్యంలో బీఆర్‌ స్టేడియంలో గురువారం జిల్లా క్రాస్‌కంట్రీ ఎంపికలు ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడాప్రాధికార చీఫ్‌కోచ్‌ జీ వెంకటేశ్వరరావు పోటీలను ప్రారంభించారు. అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాదు మాట్లాడుతూ ఎంపికలకు జిల్లా వ్యాపితంగా దాదాపు 100 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. జిల్లా జట్టును ఎంపికచేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో శాఫ్‌ అథ్లెటిక్‌ కోచ్‌ శివారెడ్డి, కే రవి, ఈశ్వరి, పీడీ శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement