Abn logo
May 24 2020 @ 02:47AM

ఇంటిపై బెంగ ఉంటే వెళ్లొచ్చు

హాకీ జట్లకు హెచ్‌ఐ అనుమతి


బెంగళూరు: లాక్‌డౌన్‌ కారణంగా బెంగళూరులోని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) కేంద్రంలో చిక్కుకుపోయిన భారత పురుషులు, మహిళల జట్ల సభ్యులు ఇంటికి వెళ్లేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) అనుమతించింది. అయితే ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లాక కుటుంబసభ్యులను మినహా బయటివ్యక్తులను కలవరాదని సూచించింది. ‘సాయ్‌ సెంటర్‌లో చాలారోజులుగా ఉంటున్న ఆటగాళ్లు ఇంటిపై బెంగ ఉంటే వెళ్లడానికి అనుమతించాం. మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చాక కరోనా పరీక్షలు చేస్తాం. కొన్నిరోజులు క్వారంటైన్‌లో ఉంచుతాం. ఇక త్వరలోనే కొత్త నిబంధనలతో శిక్షణ ప్రారంభిస్తాం’ అని హెచ్‌ఐ తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement