Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ‘Spirit of Humanity’ అవార్డు

హైదరాబాద్/మన్సూరాబాద్‌: ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి.. ‘స్పిరిట్‌ ఆఫ్‌ హ్యుమానిటీ’ అవార్డు అందుకున్నారు. ‘విశ్వగురు అంతర్జాతీయ రికార్డ్స్‌’ సంస్థ ఈ మేరకు ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది. గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ చేతుల మీదుగా మంగళవారం రాజ్‌భవన్‌లో అవార్డును సుధీర్‌రెడ్డి అందుకున్నారు. కొన్నేళ్లుగా సుధీర్‌రెడ్డి చేసిన, చేస్తున్న సేవలను గుర్తించిన విశ్వగురు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. గవర్నర్‌ తమిళి సై సుధీర్‌రెడ్డి సేవలను అభినందించారు. తనకు అవార్డు రావడం సంతోషంగా ఉందని, ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ అండగా ఉంటానని, వారితో మరింత మమేకమై పని చేస్తానని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో సత్యవోలు రాంబాబు, డైరెక్టర్‌ పూజిత, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి రామాకాంత్‌, పగడాల శివప్రసాద్‌, కృష్ణసాగర్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement