Abn logo
May 9 2021 @ 01:12AM

కర్ఫ్యూలో రేషన సరుకుల గోల

డీలర్‌ షాపులకు ఎగబడుతున్న జనం


యాడికి, మే 8: అసలే కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరమై అయి పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కట్టడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించి, 144సెక్షన అమలు చేస్తోం ది. అయినా యాడికిలో ఒక రేషన దుకాణం వద్ద గుంపులు గుంపులుగా రేషన కోసం వచ్చిన లబ్ధిదారులను చూస్తే కొవిడ్‌ నిబంధనలు ఏవీ అమలు అవుతున్నట్లు కనిపించ వు. అధికారులేమో ఇంటింటికి రేషన అందిస్తామని చెబుతున్నారు. వలంటీర్లమో రేషన లబ్ధిదారులకు ఫోనచేసి స్టోర్‌ వద్దకు వెళ్లి రేషన తెచ్చుకోమని చెబుతున్నారు. దీంతో శనివారం స్థానిక రేషన దుకాణం వద్ద సాయంత్రం 5గంటల సమయంలో రేషన కోసం వచ్చిన లబ్ధిదారులు ఇలా గుంపులు గుంపులుగా కనిపించారు.  

Advertisement