Abn logo
Oct 21 2020 @ 12:34PM

నేటి నుంచి వైజాగ్‌కు స్పెషల్‌ ట్రైన్‌

Kaakateeya

రిజర్వేషన్‌ ఉంటేనే ట్రైన్‌లోకి అనుమతి

చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ అమర్‌నాధ్‌


కడప: కడప రైల్వేస్టేషన్‌ నుంచి తిరుపతి మీదుగా విశాఖపట్టణానికి బుధవారం నుంచి ఫెస్టివల్స్‌ స్పెషల్‌ (07487) రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు కడప రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజూ సాయంత్రం 5.05కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే విశాఖ నుంచి (07488) స్పెషల్‌ ట్రైన్‌ ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.25 గంటలకు కడప రైల్వేస్టేషన్‌ చేరుకుంటుంది. 


డిసెంబరు 1 వరకు ఈ రైలు కొనసాగుతుంది. కడప నుంచి విశాఖ వెళ్లేందుకు ఏసీ 2 టైర్‌ రూ.2130, ఏసీ 3 టైర్‌ రూ.1540, స్లీపర్‌ రూ.570, సెకండ్‌ సిట్టింగ్‌ రూ.280లుగా రైల్వే శాఖ నిర్ణయించిందని, రిజర్వేషన్‌ ఉంటేనే ట్రైన్‌లోకి అనుమతి ఉంటుందని కడప చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ అమర్‌నాధ్‌ తెలిపారు.

Advertisement
Advertisement