Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

నూకాంబిక, శ్రీవారి ఆలయాల్లో ధన్వంతరి హోమాలు


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 2: పట్టణంలోని పలు ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. నూకాంబిక అమ్మవారు, దేమునిగుమ్మం వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ధన్వంతరి, మృత్యుంజయ హోమాలను అర్చకులు నిర్వహించారు. నూకాంబిక ఆలయం ఈవో బీఎల్‌ నగేశ్‌, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌, ఈవో జీవీ రమాభాయి ఆధ్వర్యంలో హోమాలు జరిగాయి. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని, శ్రీవారిని దర్శించుకున్నారు. సిద్ధిలింగేశ్వర, భోగలింగేశ్వరస్వామి ఆలయాల్లో లక్ష బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకం, గోపూజ, రుద్ర హోమం, సర్వకామదాంబకు లక్ష కుంకుమార్చన పూజలను నిర్వహించారు. కాశీవిశ్వేశ్వరుని ఆలయంలో లక్ష రుద్రాక్షణ ఘనంగా జరిగింది. ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు డి.రాంబాబు, జీవన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అర్చకులు సూర్యప్రకాశరావు, ఫణికుమార్‌, విశ్వేశ్వరకుమార్‌, రమణ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement