Abn logo
Jan 18 2021 @ 00:34AM

రెండో రోజు ఆ గ్రామంలో..

  1. అహోబిలేశుడికి పూజలు


ఆళ్లగడ్డ, జనవరి 17: అహోబిలం పార్వేట ఉత్సవ పల్లకి రెండో రోజు ఆదివారం మండలంలోని కొండంపల్లెకు చేరుకుంది. దీంతో గ్రామస్థులు అహోబిలేశుడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామంలోని తెలుపుల వద్ద పల్లకి విడిది చేయడంతో ఆయా తెలుపుల పరిధిలోని కుటుంబాల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉత్సవమూర్తులకు పూజలు చేసి కానుకలు సమర్పించుకున్నారు. ఉత్సవ పల్లకి సోమవారం ఆర్‌.క్రిష్ణాపురం గ్రామానికి చేరుకోనుంది.


Advertisement
Advertisement
Advertisement