Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళిక

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 27: పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణతకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు టీడబ్ల్యూ డిప్యూటీడైరెక్టర్‌ మణెమ్మ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పీఎంఆర్‌సీ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి నుంచే వందశాతం ఉత్తీర్ణత లక్ష్యం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఏసీఎంవో ఉద్దవ్‌, సీజీడీవో శకుంతల, ఏటీడీవో క్షేత్రయ్య, డీఆర్పీలు వామన్‌రావు, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement