Abn logo
Oct 10 2020 @ 03:01AM

మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Kaakateeya

ఘట్‌కేసర్‌: మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బొయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 15, 17, 18వ వార్డులలో రూ.20లక్షలతో నిర్మించనున్న మూడు పార్కుల ప్రహరీ గోడల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా  ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో మంత్రి చామకూర మల్లారెడ్డి అండదండలతో అనేక అబివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ప్రధానంగా సీసీరోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. చెరువుల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. 15, 17, 18వ వార్డుల్లో ఉన్న పార్కు స్థలాల చుట్టూ ప్రహరీగోడలు నిర్మించి అందులో మొక్కలు నాటడంతోపాటు ప్రజల రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకదారులు ఏర్పాటు చేసారని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్యానాయక్‌, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్లు మమతారాణి, అబ్బవతిని సరిత, సుర్వీ లక్ష్మీ, సుర్వీ రవీందర్‌, నాయకులు సురేందర్‌రెడ్డి, బాలేష్‌, జగన్‌మోహన్‌రెడ్డి, కాశి, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, అనంతరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement