Abn logo
Aug 1 2021 @ 00:33AM

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి

పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌తో మేయర్‌ తదితరులు

పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ మల్లికార్జుననాయక్‌

మచిలీపట్నం టౌన్‌, జూలై 31 : మచిలీపట్నంలో మొక్కలు నాటే కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, శానిటేషన్‌ మెరుగు పరచాలని రాష్ట్ర పురపాలక పట్టణా భివృద్ధి సంస్థ కమిషనర్‌, డైరెక్టర్‌ మల్లికార్జుననాయక్‌ సూచించారు. 18వ డివిజన్‌ సచివాలయాన్ని శనివారం సందర్శించారు. కార్యదర్శు లతో మాట్లాడుతూ  డ్రైన్లను ఆధునీ కరించాలని,  చెత్త సేకరణకు మూడు రకాల డస్ట్‌బిన్‌లను ఉపయోగించాలన్నారు. యూజర్‌ చార్జీలపై ఆరా తీశారు. 3వ డివిజన్‌లో శానిటేషన్‌ను పరిశీలించారు. రుస్తుంబాద బాలికల మునిసిపల్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి నాడు - నేడు పనులపై ఆరా తీశారు. ఆవరణలో మొక్కలు నాటించాలన్నారు. అనంతరం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్‌లు తంటిపూడి కవిత, లంకా సూరిబాబు, కమిషనర్‌ ఎస్‌. శివరామకృష్ణ, మునిసిపల్‌ ఇంజనీర్‌ ఎం. త్రినాథ్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ నాగశాస్ర్తులు, రెవెన్యూ శాఖ ఏవో ఎస్‌.వెంకటేష్‌లతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. నగరంలో తాగునీటి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నూతనంగా చేపట్టబోయే రిజర్వాయర్ల నిర్మాణ పనులపై సమీక్షించారు.