Abn logo
Sep 18 2021 @ 01:04AM

కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

ఒంగోలులో పోలీసు అధికారులకు సూచనలిస్తున్న ఎస్పీ మలికగర్గ్‌

ఒంగోలు(క్రైం) సెప్టెంబరు 17: జిల్లాలో ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్పీ మలికగర్గ్‌ వివరించారు. ఒంగోలు సమీపంలోని క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌, పీవీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో ఉన్న కౌంటింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ అనంతరం ఊరేగింపులు, బాణసంచా కాల్చడంలాంటివి చేయరాదన్నారు. ఆమె వెంట ఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు, ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జునరావు, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ సురేష్‌తోపాటుగా సీఐలు ఉన్నారు.