Abn logo
Sep 27 2020 @ 00:13AM

భూత్పూర్‌లో ఎస్పీ బాలుకు కళాకారుల నివాళి

Kaakateeya

భూత్పూర్‌, సెప్టెంబరు: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం చిత్రపటానికి శనివారం భూత్పూర్‌లోని రత్న మాల బ్రహ్మనందచారి సంగీత నాటక అకాడమి కళాకారులు పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎస్పీ బాలు పాడిన పాటల ను గుర్తు చేసుకొని కళాకారులు కన్నీరు పెట్టు కున్నారు. బాలు మన మధ్యలో లేకున్నా పాటల రూపంలో మన అందరి హృదయాలో నిలిచిపోయారని పలువురు కళాకా రులు అన్నారు. కార్యక్రమంలో కళాకారులు హర్మొనిస్టు తిరుప తయ్య, మురళీదర్‌గౌడ్‌, హర్యానాయక్‌, కొండన్న, శ్రీనివాస్‌రావు, శంకర్‌రావు, కృష్ణయ్యగౌడ్‌, అయోద్య, మన్నెంకొండ, రామాచారి, ప్రభులింగం పాల్గొన్నారు.


బాలసుబ్రమన్యం మృతి తీరనిలోటు

బాలానగర్‌: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమన్యం మృతి సినీప్రపంచానికి తీరనిలోటని వైస్‌ఎంపీపీ వెంకటాచారి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాలు మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
Advertisement