Abn logo
Jul 31 2021 @ 01:04AM

గుంతకల్లు మున్సిపాలిటీ రెండో వైస్‌ చైర్‌పర్సనగా నైరుతి రెడ్డి ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం చేస్తున్న నైరుతిరెడ్డి

గుంతకల్ల్లు టౌన, జూలై 30: మున్సిపల్‌ రెండవ వైస్‌ చైర్‌పర్సనగా నైరుతిరెడ్డి శుక్రవా రం ప్రమాణ స్వీకారం చేశారు. పట్టణంలోని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో వైస్‌ చైర్‌పర్సన ప్రమాణ స్వీకారోత్సవాన్నినిర్వహించారు. కా ర్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వై వెంకటరామి రెడ్డి హాజరుకాగా, జాయింట్‌ క లెక్టర్‌ గంగాధర్‌ గౌడ్‌ ప్రొసిడింగ్‌ అధికారిగా  వ్యవహరించారు. నైరుతిరెడ్డినిరెండో వైస్‌ చై ర్‌పర్సనగా వైసీపీ కౌన్సిలర్‌ నరేష్‌ ప్రతిపాదించగా, వైస్‌ చైర్‌పర్సన మైమున బలపరిచారు. దీంతో రెండవ వైస్‌ చైర్‌పర్సనగా నైరుతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నైరుతి రెడ్డితో ప్రొసీడింగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చే యించారు. అనంతరం ఎమ్మెల్యే వై వెంకట రామిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన ఎన భవాని, టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు.. నైరుతిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.