Abn logo
Dec 2 2020 @ 06:42AM

‘తీవ్రం’గా వాయుగుండం

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం మంగళవారం  తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తుఫాన్‌గా మారి, బుధవారం రాత్రి ట్రింకోమలై  (శ్రీలంక) వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తర్వాత ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి, గురువారం ఉదయానికి మన్నార్‌ గల్ఫ్‌, దాన్ని ఆనుకుని ఉన్న కొమోరిన్‌ ప్రాంతంలోకి ప్రవేశిస్తుందని, శుక్రవారం కన్యాకుమారి-పంబన్‌ మధ్య తీరం దాటుతుందని పేర్కొంది.  బుధ, గురువారాల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement