Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేప్‌టౌన్ టెస్ట్.. ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా

కేప్‌టౌన్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఇక్కడి న్యూలాండ్స్ మైదానంలో జరిగిన చివరిదైన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 2-1 తేడాతో సిరీస్ సఫారీల వశమైంది. సిరీస్ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో దారుణంగా విఫలమైన టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది.


ఓవర్ నైట్ స్కోరు 101/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికా కీగన్ పీటర్సెన్ (82) వికెట్‌ను మాత్రమే కోల్పోయి 212 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది. డుసెన్ 41, బవుమా 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. తర్వాత వరుసగా రెండు టెస్టుల్లోనూ ఏడు వికెట్ల తేడాతోనే ఓడిపోవడం గమనార్హం.

Advertisement
Advertisement