Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌తో తలపడే దక్షిణఫ్రికా జట్టు ఇదే!

కేప్‌టౌన్: భారత్‌తో స్వదేశంలో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తన జట్టును ప్రకటించింది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ నెల 26న  సెంచూరియన్‌లో తొలి టెస్టు, జనవరి 3న జొహన్నెస్‌బర్గ్‌లో రెండో టెస్టు జరగనుండగా, జనవరి 11న జరగనున్న చివరిదైన మూడో టెస్టుకు కేప్‌టౌన్‌ వేదిక కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా నేడు 21 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జట్టులోకి అన్రిక్ నార్జ్ వచ్చి చేరగా, ఇద్దరు కొత్త ముఖాలు.. పేసర్ సిసండ మగాల, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ర్యాన్ రికెల్టన్‌‌లకు చోటు కల్పించింది. 


ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్ పర్యటించిన జట్టునే యథాతథంగా ప్రకటించగా, మరో ముగ్గురికి అదనంగా చోటించింది. డీన్ ఎల్గర్‌ను కెప్టెన్‌గా నియమించగా, తెంబా బవుమాను అతడికి డిప్యూటీగా ప్రకటించింది.


దక్షిణాఫ్రికా జట్టు: డీఎన్ ఎల్గర్ (కెప్టెన్), తెంబా బవుమా (వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కగిసో రబడ, వాన్ డర్ డుస్సెన్, బ్యూరాన్ హెండ్రిక్స్, జార్జి లిండే, ఐడెన్ మర్కరమ్, వియాన్ ముల్డర్, ఆన్రిక్ నార్జ్ కీగాన్ పీటర్సన్, సారెల్ ఎర్వీ, కైల్ వెర్రీన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, డువానే ఒలివియర్, గ్లెంటన్ స్టుర్మాన్, ప్రెనెలాన్ సుబ్రాయెన్, సిసండ మగాల, రియాన్ రికెల్టన్.

Advertisement
Advertisement