Abn logo
Aug 14 2020 @ 12:25PM

39 మంది చిన్నారుల‌కు అండ‌గా నిలిచిన సోనూసూద్‌!!

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంద‌రికో అండ‌గా నిలిచిన రియ‌ల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్‌. తాజాగా మ‌రోసారి త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. కాలేయ మార్పిడి చికిత్స కోసం పిలీపీన్స్ నుండి న్యూఢిల్లీ రావాల్సిన 39 మంది చిన్నారుల‌కు అండ‌గా నిల‌బడ్డారు సోనూసూద్. చిన్నారులు ఢిల్లీ చేరుకోవ‌డానికి ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేశారు. మ‌రో రెండు రోజుల్లో ఈ విమానం ఢిల్లీ చేరుకోనుంది. వీరిలో పిలీప్పీన్స్‌కు చెందిన కుర్రాళ్లు కూడా ఉన్నారు. వీరంతా 1 నుండి 5 ఏళ్లలోపు వారే. అట్రీసియా అనే కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు న్యూఢిల్లీలో లివ‌ర్ ప్లాంటేష‌న్ చేస్తున్నారు. ఈ విష‌యంలో నెటిజ‌న్స్ సోనూసూద్‌ను ప్ర‌శంసిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement