Abn logo
Oct 24 2020 @ 14:13PM

తన ఫోన్‌కు ఫ్రీ రీచార్జ్‌ చేయాలని కోరుతున్న సోనూసూద్‌

Kaakateeya

నటుడు సోనూసూద్‌ తన ఫోన్‌కు ఫ్రీ రీచార్జ్‌ చేయాలని కోరుతున్నాడు. అది కూడా తన సోషల్‌ మీడియా ద్వారా.. ఇంతకీ సోనూ అలాంటి కోరికను ఎందుకు కోరాడో తెలుసా..!. కోవిడ్‌ సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు తగిన వసతులను ఏర్పాటు చేసిన సోనూసూద్‌ తర్వాత పేదలకు అండగా నిలిచారు. రోజువారి కూలీలు, తిండిలేక ఇబ్బంది పడుతున్నవారి కోసం సోనూసూద్‌ ముందుకు వచ్చారు. వారికి తిండిని ఏర్పాటు చేయడమే కాదు.. ఎక్కడెక్కడో పనిచేస్తున్న రోజువారి కూలీలను వారి స్వస్థలాలకు చేరేలా తగు జాగ్రత్తలు తీసుకుని రియల్‌ హీరో అనిపించుకున్నారు. ప్రజలు సోనూసూద్‌పై తమకు తోచిన రీతిలో అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. కొందరు తమ పిల్లలకు సోనూసూద్‌ పేరు పెట్టుకుంటే, కొందరు తమ షాపులకు సోనూసూద్‌ పేరు పెట్టుకున్నారు. అలా ఓ మొబైల్‌ షాప్‌ యజమాని తన సోనూసూద్‌ ఫొటో వచ్చేలా పేరు మార్చాడు. ఆ షాప్‌ ఫొటో సహా విషయం తెలుసుకున్న సోనూసూద్‌ 'మీరు నా మొబైల్‌కు ఫ్రీగా రీచార్జ్‌ చేస్తారా?' అని తమాషాగా ప్రశ్నిస్తూ ఆ ఫొటోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 



Advertisement
Advertisement