Advertisement
Advertisement
Abn logo
Advertisement

తల్లిదండ్రుల చావుకు కారణమైన కొడుకు అరెస్ట్

సూర్యాపేట: వ‌ృద్ధాప్య దశలో ఉన్న కన్న తల్లిదండ్రులకు అన్నం, నీరు పెట్టకుండా వారి మరణానికి కారణమైన కొడుకు, కోడలును అరెస్ట్ చేసినట్లు మునగాల సీఐ ఆంజనేయులు వెల్లడించారు. సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం మోతే మండలంలోని తుమ్మగూడెం గ్రామంలో మే 27న నల్లు రామచంద్రా రెడ్డి(90), అతని భార్య అనసూర్యమ్మ (80)లు ఒకేసారి మృతి చెందారన్నారు. వారి మృతదేహాలను కుటుంబీకులు పూడ్చి పెట్టారన్నారు. అయితే వారి చావుపై పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారన్నారు. పూడ్చిన మృతదేహాలను బయటకు తీసి పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించారని ఆయన తెలిపారు. తల్లిదండ్రుల చావుకు కారణం కొడుకు నాగేశ్వర్ రెడ్డి, కోడలు లక్ష్మిలని నిర్దారణ కావడంతో వారి ఇరువురిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. 

Advertisement
Advertisement