కర్నూలు(అర్బన్), జనవరి 17: డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేవీ. మధుసూదన్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని ఫర్ మెన్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21 విజయవాడలో తలపెట్టిన మహా ధర్నాను విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అధ్యాపకుల బదీలీలను చేపట్టాలని, యూజీసీ 2016 అరియర్స్, కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసినప్పటికీ విడుదల చేయకపోవడం శోచనీయమని అన్నారు. అరియర్స్ వెంటనే విడుదల చేయాలని, నూతన సేళ్లల్లో పీహెచ్డీ, ఇంకా అదనపు అర్హతలకు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని అన్నారు. అర్హతలు కలిగిన వారికి ప్రిన్సిపల్ పదోన్నతులు ఇవ్వాలని, కనీసం ప్రతి ఏడాదీ సీఏఎస్ నోటిిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. కండిషనల్ అపాయింట్ మెంట్ వారికి అటోమేటిక్ అడ్వాన్స్మెంట్ పథకం, ప్రయోజనాలు అందరికి విడుదల చేయాలని, సెమిస్టర్ విధానం తరువాత వేసవి సేలవులు తగ్గినందున, అందుకు తగ్గట్టుగా ఈఎల్ మంజూరు చేయాలని అన్నారు. అలాగే మే 2019 ఎన్నికల్లో పాల్గొన్న అధ్యాపకులు వేసవి సెలువులు కోల్పోయినందున దానికి తగ్గట్టుగా ఈఎల్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మస్తానయ్య, ఎం.రమేష్, ఎంసీ. సాహిత్య తదితరులు పాల్గొన్నారు.