Abn logo
Oct 23 2021 @ 00:28AM

చంద్రబాబుకు సంఘీభావం

చంద్రబాబుకు సంఘీభావం తెలపడానికి విజయవాడ వెళ్లిన టీడీపీ నేతలు

  మంగళగిరి వెళ్లిన టీడీపీ నేతలు 

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, అక్టోబరు 22 : టీడీపీ రాష్ట్ర కార్యాలయం, నేతల ఇళ్లపై వైసీపీ జరిపిన దాడులకు నిరసనగా పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు మద్దతుగా జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివెళ్లారు. ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి రాధాకృష్ణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఏలూరు నుంచి 40 కార్లలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు బయలుదేరి వెళ్లారు. వీరిలో ఉప్పాల జగదీష్‌బాబు, పూజారి నిరంజన్‌, పెద్దిబోయిన శివప్రసాద్‌, దాకారపు రాజేశ్వరరావు, గవ్వా మధు తదితరులు ఉన్నారు. రెండు రోజుల నుంచి టీడీపీ ప్రధాన కార్యాలయంలోనే వున్న మాజీ మంత్రి పీతల సుజాత శుక్రవారం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇలా ప్రతిపక్షాలపై దాడులు చేయడం చూడలేదన్నారు. జగన్‌ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయన్నారు. టీడీపీ కార్యాలయ భవన మరమ్మతులకు నరసాపురం నియోజకవర్గం నుంచి కొవ్వలి నాయుడు రూ.2 లక్షలు పార్టీ అధినేత చంద్రబాబుకు అందించారు. పోలవరం, కొవ్వూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం ని యోజకవర్గాల నుంచి నేతలు మంగళగిరి వెళ్లి దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా జంగారెడ్డిగూడెం, భీమవరం తదితర ప్రాంతాల్లో శుక్రవారం రెండో రోజు దీక్షలను కొనసాగించారు.


చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత