Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎక్కడ దాక్కున్నావయ్యా అంటూ మంత్రి అనిల్‌పై ట్రోలింగ్

అమరావతి: అన్ని రోజుల ఒకేలా ఉండవు..ఎవరికి అవకాశం దొరికితే వాళ్లు చెలరేగిపోవడం మామూలే. ఇప్పుడు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు ఇప్పుడు ఇది తెలిసిరావొచ్చు. ఏడాది క్రితం టీడీపీ ఎమ్మెల్యేలు పోలవరంపై ప్రశ్నిస్తే వాళ్లను ఎద్దేవా చేస్తూ డిసెంబర్ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని భీకర‌స్వరంతో శాసనసభలో ప్రకటించారు. 

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గతంలో పెట్టిన డెడ్ లైన్లపై సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. మంత్రి అనిల్ కుమార్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఆనాడు అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలను ఎద్దేవా చేస్తూ అన్న మాటలను ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో సర్యూలెట్ చేస్తున్నారు. మంత్రిపై పడుతున్న పంచ్‌లు మామూలు రేంజ్‌లో లేవు. ‘ప్రాజెక్టు పూర్తి చేశారు కదా ప్రారంభిస్తున్నారా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘పోలవరం పూర్తి అయిందా?. ఇంకా ఏంటి సంగతులేంటి?. ఓపెనింగ్‌కు ఎవరొస్తున్నారు?’. అంటూ అనిల్ వీడియోను షేర్ చేసుకుంటూ తెలుగు తమ్ముళ్లు ఎటకారాన్ని బాగా పండిస్తున్నారు. ‘డిసెంబర్ 1న నేను పోలవరం వెళ్తున్నా.. ఎవరైనా వస్తారా?’ అని సెటైర్లు పేలుతున్నాయి. 


Advertisement
Advertisement