Abn logo
Apr 6 2020 @ 17:31PM

రేషన్ పంపిణీలో కనిపించని సోషల్ డిస్టెన్స్

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినా లాక్ డౌన్ రూల్స్ అమలు కావడంలేదు. ఉదయం అయితే చాలు జనం రోడ్లమీదకు గుంపులు గుంపులుగా వస్తున్నారు. మరోవైపు రెడ్ జోన్ పరిధిలో ప్రాంతాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందడంలేదు. రేషన్, వెయ్యి రూపాయల పంపిణీ కార్యక్రమాలు కరోనా వ్యాప్తి చేసేలా తయారయ్యాయి. నెల్లూరు, కావలి వంటి చాలా చోట్ల రెడ్‌జోన్లు ప్రకటించినా జనం మాత్రం రోడ్లమీదకు వస్తున్నారు. దీని వల్ల మరిన్ని ఇబ్బందులు వస్తాయనే విషయం మరిచిపోతున్నారు. పోలీసులు నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నా.. ప్రజలు మాత్రం స్వచ్చంధంగా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. 

Advertisement
Advertisement
Advertisement