Abn logo
Sep 22 2020 @ 04:22AM

‘స్నో లెపర్డ్‌’ రిటా మృతి

Kaakateeya

ఖాట్మండు: నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు అంగ్‌ రిటా షెర్పా మృతి చెందాడు. 72 ఏళ్ల రిటా కాలేయ, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. సాహసికుడైన రిటాను ముద్దుగా ‘స్నో లెపర్డ్‌ (మంచు చిరుత)’ అని పిలుచుకుంటారు. 1983-96 మధ్య ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం లేకుండా అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ పర్వతాన్ని పదిసార్లు అధిరోహించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 

Advertisement
Advertisement
Advertisement