Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐపీఓకు స్నాప్‌డీల్... 250 మిలియన్ డాలర్ల లక్ష్యం...

ముంబై : గ్లోబల్‌ మేజర్స్‌ అయిన సాఫ్ట్‌బ్యాంక్‌, ఆలీబాబా పెట్టుబడులున్న ఈ-కామర్స్ కంపెనీ సంస్థ ‘స్నాప్‌డీల్’... స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగిడుతోంది. మరికొన్ని వారాల్లో సెబీకి డ్రాఫ్ట్‌ పేపర్లు దాఖలు చేయనున్నట్లు వినవస్తోంది. ప్రైమరీ మార్కెట్‌ నుంచి ఇది 250 మిలియన్ డాలర్లను వసూలు చేసే  అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. కాగా... 1.5 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో కనీసం 200 మిలియన్ డాలర్లనైనా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ వ్యాపార మోడల్‌ బాగా అభివృద్ధి చెందుతోన్న విషయం తెలిసిందే. భారత్‌లో... అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఈ కంపెనీకి గట్టి ప్రత్యర్థులు. తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీలు చిన్నచూపు చూస్తున్న, వేగంగా వృద్ధి చెందుతున్న చిన్న నగరాల్లో స్నాప్‌డీల్ అధికంగా ‘వ్యాపారం’ చేస్తోంది. కాగా... ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తున్న పేటీఎం తరహాలోనే ఇది కూడా అతిపెద్ద టెక్‌ కంపెనీగా అవతరించవచ్చని భావిస్తున్నారు. 

Advertisement
Advertisement