Abn logo
Jul 10 2020 @ 18:04PM

పొలం పనులు చేస్తుండగా కూలీలకు పాముకాటు

కృష్ణా : జిల్లాలో పాముకాట్లు కొనసాగుతున్నాయి. దీంతో వ్యవసాయ కూలీలు, రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా.. జిల్లాలోని పామర్రు నియోజకవర్గ పరిధిలో ముగ్గురు రైతు కూలీలకు పాముకాటుకు గురయ్యారు. శుక్రవారం నాడు పొలంలో పనిచేస్తుండగా వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురికి పాముకాటు వేసింది. ఆ ముగ్గురు బాధితులను హుటాహుటిన మొవ్వ ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన కూలీలు చికిత్స అందిస్తున్నారు. కాగా వీరి ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. కూలీల కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement