Abn logo
Aug 2 2021 @ 00:05AM

పాము కాటుతో యువకుడి మృతి

పాలకోడేరు, ఆగస్టు 1 : పాము కాటు వేసి ఒక యువకుడు మృతిచెందాడు. శృంగవృక్షం గ్రామానికి చెందిన కుక్కునూరి తేజ మణికంఠ(20) ఆటో డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసి ఇంటి బయట పడుకున్నాడు. అర్ధరాత్రి నోటి నుంచి నురగలు వస్తుండడంతో పాము కాటు వేసినట్టు గుర్తించి వెంటనే భీమవరంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు తర లించగా చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.