Abn logo
Aug 4 2021 @ 00:09AM

చింతలూరులో కింగ్‌కోబ్రా కలకలం

ప్రత్తిపాడు, ఆగస్టు 3:  చింతలూరు గ్రామంలో కింగ్‌ కోబ్రా సంచరించడంతో గ్రామంలో కలకలం రేగింది. పెద్ద చెరువు వెనుక ఉన్న వెలుగుబండి, బొడ్డు లోవరాజు, సూరిబాబులకు చెందిన తోటలో 12 అడుగుల పైబడి పొడవు గల ఈ భారీ కింగ్‌ కోబ్రాను చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు.   విష సర్పాన్ని అటవీ శాఖాధికారులు పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.