Abn logo
Sep 28 2020 @ 06:10AM

ఓ వారాలబ్బాయి జయభేరి (మురళీమోహన్ ఇంటర్వ్యూ)

Kaakateeya

ఎచ్చెర్ల/రాజాం, సెప్టెంబరు 27: ఐఐటీ, ఎన్‌ఐటీ అత్యున్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలు జిల్లాలో మూడు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల (ఎచ్చెర్ల), శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల (చిలకపాలెం), జీఎంఆర్‌ ఐటీ (రాజాం)లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరిగింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ పరీక్షలు జరిగాయి .


జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌ పరీక్షకు అవకాశం కల్పించారు. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాఽశాల (ఎచ్చెర్ల)లో 150 మంది విద్యార్థులకు గాను 140 మంది, శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల (చిలకపాలెం)లో 105 మందికి 104 మంది, జీఎఆర్‌ఐటీ (రాజాం)లో 200 మంది విద్యార్థులకుగాను 198 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 455 మందికి 442 మంది విద్యార్థులు హాజరైనట్టు అధికారులు ధ్రువీకరించారు. 

Advertisement
Advertisement