Abn logo
May 30 2020 @ 04:26AM

నైపుణ్యాలను పెంపొదించుకోవాలి

ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు స్థలాన్ని కేటాయిస్తాం

ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

రూ.10.92 కోట్ల రుణాలు పంపిణీ


భగీరథ కాలనీ, మే 29 : ప్రభుత్వం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని, మహిళలు తమలోని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సుదర్శన్‌ కన్వెన్షన్‌ హాల్‌ శుక్రవారం జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు,. డ్వాక్రా ఎగ్జిబిషన్‌ను కలెక్టర్‌ వెంకట్రావ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.


స్టాళ్లను సందర్శించి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. మహిళలకు రూ.10.92 కోట్ల రుణాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్థాయి పెంచేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందజేస్తోందన్నారు. స్థానికంగా ఉన్న వనరుల ద్వారా ఉపాధి పొందాలన్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేసుకునే అవకాశాలున్నాయని, వాటిని మార్కెటింగ్‌ చేసుకునే విధానం తెలిసి ఉండాలని చెప్పపరు. తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు త్వరలో జిల్లాలో ప్రారంభించనున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లో స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు.


ఈ సందర్భంగా మంత్రి మహా (మహబూబ్‌నగర్‌ మహిళా ప్రొడక్ట్స్‌) పేరుతో ఉన్న లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ మోహన్‌లాల్‌, డీఆర్‌డీవో పీడీ వెంకట్‌రెడ్డి, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ నాగరాజ్‌కుమార్‌, సెర్ప్‌ డైరెక్టర్‌ మల్లారెడ్డి, డీఆర్‌డీఏ ఏపీడీ శారద, నాగమల్లిక, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య పాల్గొన్నారు.


Advertisement
Advertisement