Abn logo
Oct 22 2021 @ 00:43AM

ద్విచక్ర వాహనం చోరీ కేసులో ఆరు నెలల జైలు

తిరుపతి(లీగల్‌), అక్టోబరు 21: ద్విచక్ర వాహనం చోరీకి పాల్పడిన కేసులో తిరుపతి రూరల్‌ శ్రీకష్ణనగర్‌కు చెందిన తలారి కనకరాజు అలియాస్‌ రాజుకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు గురువారం తీర్పు చెప్పారు. 2016జూన్‌ 25న తుమ్మలగుంట అవిలాల వైన్‌షాపు వద్ద పార్కింగ్‌ చేసివున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ను కనకరాజు ఎత్తుకెళ్లిపోయాడు. బాధితుడు ఢిల్లీబాబు పిర్యాదు మేరకు తిరుపతి క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు నిరూపణ కావడంతో కోర్టు శిక్ష విధించింది. కనకరాజు జిల్లా కోర్టులో అప్పీలు చేసుకోగా కింది కోర్టు తీర్పును సమర్ధిస్తూ న్యాయమూర్తి వై.వీర్రాజు తీర్పు ఇచ్చారు. ఇన్‌చార్జి ఏపీపీ వెంకటనారాయణ ప్రాసిక్యూషన్‌ తరపు కేసు వాదించారు.