Abn logo
Aug 5 2020 @ 08:15AM

బాలికపై ఆరుగురు యువకుల అఘాయిత్యం

కంగ్రా (హిమాచల్ ప్రదేశ్): ఓ మైనర్ బాలికపై ఆమె ఆరుగురు స్నేహితులు అత్యాచారం చేసి, వీడియో తీసిన దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా నగరంలో వెలుగుచూసింది. ఓ మైనర్ బాలిక తన ఆరుగురు స్నేహితులతో కలిసి వస్తుండగా ఆమెను చుట్టుముట్టిన యువకులు సామూహిక అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశారు. నిందితుడు ఒకరు అత్యాచార వీడియోను బాలికకు పంపించాడు. దీంతో బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతోబాలిక ఫిర్యాదు మేర పోలీసులు ఆరుగురు యువకులపై ఐపీసీ సెక్షన్ 376 డి, 354, 34 . పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు నిందితులైన యువకులను అరెస్టు చేశామని ఎస్పీ రంజన్ చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement