Abn logo
Oct 14 2021 @ 00:30AM

మెడికల్‌ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన

మ్యాప్‌ను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ గంప, కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌

కామారెడ్డి, అక్టోబరు 13: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డెయిరీ కళాశాల సమీపంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలాన్ని బుధవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పరిశీలించారు. అనంతరం ఆడిటోరియం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ,నాయకులు ముజిబోద్దిన్‌, నిట్టువేణుగోపాల్‌రావు, కౌన్సిలర్‌లు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.