Abn logo
Mar 28 2020 @ 08:59AM

ఆ డైరెక్ట‌ర్‌పై భ‌రోసా పెట్టుకున్న నిర్మాణ సంస్థ‌

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అనుబంధ సంస్థ‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మీడియం బ‌డ్జెట్ సినిమాలు చేస్తూ మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకుంటోంది. ఈ ఏడాది భీష్మ‌తో మంచి స‌క్సెస్‌ను సాధించిన ఈ సంస్థ ఇప్పుడు మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ సినిమా తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. ఈ సినిమాలో బాల‌కృష్ణ‌, మంచు విష్ణు, రానా న‌టిస్తాడంటూ పేర్లు విన‌ప‌డుతున్నాయి. కాగా.. మ‌ల‌యాళ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ బాధ్య‌త‌ను నిర్మాతలు.. త‌మ బ్యాన‌ర్‌లో రీసెంట్‌గా భీష్మ‌తో హిట్ కొట్టిన డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌కు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. మ‌రి నిర్మాణ సంస్థ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వెంకీ ఏ మేర‌కు నేర‌వేరుస్తాడో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement