Advertisement
Advertisement
Abn logo
Advertisement

తమ్ముడితో కలిసి సిటీలో అద్దె గదిలో ఉంటూ చదువుకుంటున్న 22 ఏళ్ల యువతి.. అనుకోకుండా ఓ రోజు రాత్రి జరిగిన ఘోరమిది..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతికి 22ఏళ్ల వయసు ఉంటుంది. తన గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న పట్టణంలో తమ్ముడితో కలిసి అద్దె గదిలో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో రోజూ వెళ్లినట్టుగానే ఉదయమే కాలేజీకి వెళ్లి, సాయంత్రానికి రూంకు తిరిగొచ్చింది. ఆ యువతి సోదరుడు కూడా తన చదువుకు సంబంధించిన కార్యక్రమాలను ముగించుకుని రూంకి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి అనుకోకుండా ఘోరం చోటు చేసుకుంది. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌కు చెందిన 22ఏళ్ల రింకి పటేల్ అనే మహిళ తన తమ్ముడు అమిత్ పటేల్‌తో కలిసి ఛతర్‌పూర్ పట్టణంలో అద్దె గదిలో ఉంటోంది. కిరాయి రూంలోనే ఉంటూ బీఏ చేస్తున్న ఆమె.. ఎప్పటిలాగానే శనివారం కూడా కాలేజీకి వెళ్లొచ్చింది. 13ఏళ్ల అమిత్ పటేల్ కూడా స్కూల్‌కు వెళ్లి తిరిగొచ్చాడు. ఈ క్రమంలోనే రాత్రి.. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అనంతరం అమిత్ పటేల్ దాబా మీదకు వెళ్లగా.. ప్రమాదవశాత్తూ అతడికి కరెంట్ షాక్ తగిలింది. తమ్ముడి అరుపులతో దాబా మీదకు వెళ్లిన రింకి పటేల్.. తమ్ముడిని పరిస్థితి చూసి భయాందోళనలకు గురైంది. అనంతరం అతడిని కాపాడే క్రమంలో ఆమె కూడా కరెంట్‌ షాక్‌కు గురైంది. ఎట్టకేలకు తమ్ముడిని రక్షించుకున్న రింకి పటేల్.. కరెంట్ షాక్ తగలడంతో గాయపడింది. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న స్థానికులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కాగా.. వారికి చికిత్స చేసిన వైద్యులు ప్రాణాపాయం లేదని వెల్లడించారు. అంతేకాకుండా.. రింకి పటేల్ కంటే.. ఆమె తమ్ముడు ఎక్కువగా గాయపడినట్లు వెల్లడించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement