Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రైవేట్ జాబ్ చేస్తున్న అక్క.. రూమ్‌లోనే ఉండి జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న తమ్ముడు.. చివరకు జరిగిన ఘోరమిది..!

ఇంటర్నెట్ డెస్క్: అక్కతో కలిసి ఉంటున్నాడా కుర్రాడు. ఇన్‌స్పెక్టర్ అవ్వాలని చాలా పట్టుదలగా చదువుతున్నాడు. అలాంటిది ఆ రోజు ఉద్యోగం నుంచి వచ్చిన అక్కకు ఇంట్లో ఏ అలికిడీ వినిపించలేదు. ఏంటి? తమ్ముడు ఇంట్లో లేడా? అనుకుంటూ అతని గది దగ్గరకు వెళ్లి తలుపు కొట్టింది. అతను తలుపు తీయకపోవడంతో కొంచెం గట్టిగా నెట్టింది. అంతే ఎదురుగా కనిపించిన దృశ్యం ఆమెను నిలబడనీయలేదు. ఎందుకంటే.. ఇన్‌స్పెక్టర్ అవ్వాలని పట్టుదలతో చదువుతున్న తన తమ్ముడు ఫ్యానుకు ఉరేసుకొని వేలాడుతున్నాడు మరి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.


రాజేష్ అనే యువకుడు తన అక్క వాళ్ల ఇంట్లో ఉండి ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్నాడు. అతను సడెన్‌గా ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. రాజేష్ చదువుకునే కాలేజిలో ఒక యువతితో ప్రేమలో పడ్డాడని, ఆ గొడవ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాజేష్ గదిలో సూసైడ్ నోట్ కూడా దొరికిందని తెలుస్తోంది. అయితే ఈ నోట్‌ను పోలీసులు బయటపెట్టడం లేదు. ఘటన జరిగి రెండ్రోజులైనా ఇప్పటికీ ఆత్మహత్యకు సరైన కారణాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతోంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement