Abn logo
Sep 27 2020 @ 09:45AM

సింగూరు ప్రాజెక్టుకు భారీ వరద

Kaakateeya

సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 17,376 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 120 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement
Advertisement
Advertisement