Abn logo
May 28 2020 @ 00:10AM

సింగపూర్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు..!

సింగపూర్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. సింగపూర్‌లోనూ రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. బుధవారం ఒక్కరోజే సింగపూర్‌లో 533 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం రోజు కరోనా బారినపడ్డవారిలో అత్యధికంగా విదేశీ కార్మికులే ఉన్నారని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు. మహమ్మారి బారిన పడ్డ 533 మందిలో 530 మంది.. విదేశీ కార్మికులే అని అధికారులు స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటి వరకు సింగపూర్‌లో నమోదైన కేసుల సంఖ్య 32,876కు చేరింది. మహమ్మారి కాటుకు 23 మంది బలయ్యారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement