Abn logo
May 23 2020 @ 11:15AM

`చంద్రముఖి`ని అప్పుడు వదులుకుంది.. ఇప్పుడు దక్కించుకుందా?

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు పి.వాసు దాదాపు పదిహేనేళ్ల క్రితం తెరకెక్కించిన సినిమా `చంద్రముఖి`. అప్పటివరకు వరుస ఫ్లాప్‌లతో సతమతమైన రజినీకాంత్‌ ఈ సినిమాతోనే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక, అప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చేసిన హీరోయిన్ జ్యోతిక ఈ సినిమాలో అద్భుత నటన ప్రదర్శించింది. 


`చంద్రముఖి`గా జ్యోతిక నటనకు తెలుగు, తమిళ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నిజానికి ఈ సినిమా అవకాశం ముందుగా హీరోయిన్ సిమ్రాన్ వద్దకు వెళ్లిందట. వ్యక్తిగత కారణాల వల్ల సిమ్రాన్ ఈ సినిమా చేయలేకపోయింది. `చంద్రముఖి`లో నటించలేకపోయినా ఆ సినిమా సీక్వెల్‌లో మాత్రం సిమ్రాన్ నటించబోతోందట. పి.వాసు దర్శకత్వంలోనే `చంద్రముఖి` సీక్వెల్ తెరకెక్కనుంది. రాఘవ లారెన్స్ ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో `చంద్రముఖి` పాత్ర సిమ్రాన్‌కు దక్కినట్టు తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement