Abn logo
Oct 31 2020 @ 15:11PM

సినిమా కోసం 31 కిలోల బరువు తగ్గిన హీరో

Kaakateeya

ఓ హీరో సినిమా కోసం ఏకంగా 31 కిలోల బరువు తగ్గి అందరికీ షాకిచ్చాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో కాదు.. శిలంబరసన్‌ అలియాస్ శింబు. ఈ హీరో అటు తమిళ ప్రేక్షకులకే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన హీరోగా చేసిన మన్మథ, వల్లభ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాయి. కాగా.. మధ్యలో ఈ హీరో చేసిన సినిమాలు ప్లాప్‌ కావడంతో పాటు ఫిజిక్‌పై దృష్టి పెట్టకపోవడంతో విపరీతంగా బరువు పెరిగాడు. అయితే శింబు బౌన్స్‌ అవ్వాలనుకున్నాడు. అందుకనే ఫిజిక్‌పై దృష్టి పెట్టి 101 కిలోల బరువు నుండి 31 కిలోల బరువు తగ్గి 70 కిలోలకు చేరుకున్నాడు. ఈ హీరో లేటెస్ట్‌ లుక్‌ చూసిన ఆయన ఫ్యాన్స్‌ సంతోషపడుతున్నారు. తనలో మార్పు తనకే షాకిచ్చిందంటున్న శింబు ఇప్పుడు ఈశ్వరుడు సినిమాతో పాటు సుశీంద్రన్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. 


Advertisement
Advertisement